News April 4, 2025
ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

AP: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది.
Similar News
News April 5, 2025
BREAKING: APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల

AP: ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రిజల్ట్స్‌తోపాటు ఎగ్జామ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసింది. కీని APPSC వెబ్సైట్లో పొందుపరిచింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మందిని ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వీరందరికి త్వరలోనే కాల్ లెటర్లు పంపనుంది.
News April 5, 2025
IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
News April 4, 2025
ఈ నెల 16 నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో యాజమాన్యంతో చర్చిస్తామని, సానుకూలంగా స్పందించకపోతే 16 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించాయి. రేపు సాయంత్రం ఫ్యాక్టరీ ఆర్చ్ వద్ద రాస్తారోకో చేస్తామని తెలిపాయి. త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నాయి.