News November 9, 2024
నెల్సన్తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఖరారు?

జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఖరారైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ చెప్పిన పలు కథల్లో ఒకదాన్ని ఆయన ఓకే చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాను నిర్మించేందుకు రెండు పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని, త్వరలో అధికారికంగా ప్రకటన విడుదల కానుందని తెలిపాయి. ఇటు తారక్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్ చేస్తున్నారు. తర్వాత నీల్ మూవీ చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.
Similar News
News December 15, 2025
ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.
News December 15, 2025
సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.
News December 15, 2025
హెయిర్ క్రింపింగ్ ఎలా చేయాలంటే?

కొందరు అమ్మాయిలకు జుట్టు పలుచగా ఉంటుంది. ఒత్తుగా కనిపించాలని పార్లర్కి వెళ్లి హెయిర్ క్రింపింగ్ చేయించుకుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటించి ఇంట్లోనే దీన్ని చేసుకోవచ్చు. ముందు జుట్టుకు హెయిర్ ప్రొటక్షన్ను అప్లై చేసి చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. జుట్టును లేయర్స్గా తీసుకుంటూ హెయిర్ క్రింపర్తో గట్టిగా ప్రెస్ చేయాలి. జుట్టు మొత్తం ఇలా చేశాక హెయిర్ స్ప్రే చేస్తే చాలు జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.


