News August 6, 2025

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ‘వార్-2’ ప్రీరిలీజ్ ఈవెంట్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘వార్-2’ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే రేపు సినిమాలోని ‘సలామ్ అనాలి’ సాంగ్ ప్రోమో రానుందని తెలిపారు. అయితే ‘దేవర’ ఈవెంట్‌లా ఫెయిల్ చేయొద్దని, పకడ్బందీగా ప్లాన్ చేయాలని మేకర్స్‌కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Similar News

News August 6, 2025

ఇది అన్యాయం, అసమంజసం: భారత్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.

News August 6, 2025

ఇందిరా గాంధీని మోదీ ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్

image

ఇండియాపై టారిఫ్స్‌ను ట్రంప్ 50%కి పెంచడంతో PM మోదీపై కాంగ్రెస్ ఫైరైంది. ‘2019లో హౌడీ మోదీ ఈవెంట్ నుంచి పాక్‌తో సీజ్‌ఫైర్ వరకు ట్రంప్‌కు మోదీ మద్దతుగా నిలిచారు. అన్ని విషయాల్లో మౌనం పాటించారు. అయినా ట్రంప్ టారిఫ్స్ విధించడం మోదీ వైఫల్యమే. ఇందిరాగాంధీ USను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఈగోను పక్కనపెట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఫారిన్ పాలసీ మారాలి’ అని INC జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

News August 6, 2025

భారత్‌పై 50% టారిఫ్స్.. అమల్లోకి ఎప్పటినుంచంటే?

image

ఇటీవల భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 25శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. తాజాగా విధించిన 25శాతం అదనపు టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 50శాతం సుంకాలు వర్తించనున్నాయి. ఫలితంగా ఆసియాలో చైనా(51శాతం) తర్వాత అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న దేశం భారతే కానుంది.