News March 29, 2025
NTRకు బ్రహ్మరథం పట్టిన బాపట్ల జిల్లా

సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున(1982 మార్చి 29న) NTR టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. రేపల్లెలో ఎడ్ల వెంకట్రావు, వేమూరులో నాదెండ్ల భాస్కరరావు, బాపట్లలో సీవీ రామరాజు, చీరాలలో చిమట సాంబు, పర్చూరులో దగ్గుబాటి చౌదరి, అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య టీడీపీ MLAలుగా గెలిచారు.
Similar News
News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 2, 2025
వక్ఫ్ చట్ట సవరణతో వచ్చే మార్పులివే..

సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ల వద్ద వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిదే తుది నిర్ణయం. దేశంలో మొత్తం 30 బోర్డులున్నాయి. వీటి పరిధిలో 9.4L ఎకరాల భూములున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత ఇవే అత్యధికం.
News April 2, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. స్వామి వారి దర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.5.09 కోట్ల ఆదాయం సమకూరింది.