News September 22, 2025

₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

image

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్‌యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్‌‌, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.

Similar News

News September 22, 2025

ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్: మంత్రి సవిత

image

AP: దసరా, దీపావళి సందర్భంగా APCO వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత, జౌళి మంత్రి సవిత ప్రకటించారు. సంస్థ షోరూములలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్‌లో అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.

News September 22, 2025

ఆడపిల్ల కోసం ఓ చందనం మొక్క

image

బిహార్‌లోని వైశాలి జిల్లా పకోలి గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. అక్కడ ఆడపిల్ల పుడితే ఇంటి ఆవరణలో చందనం మొక్కను నాటుతారు. దాన్ని జాగ్రత్తగా సంరక్షించి కుమార్తె పెద్దయ్యాక ఆ చెట్టును అమ్మగా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి చేస్తారు. వీరు పెంచే మల్యగిరి రకం చందనం చెట్లు విక్రయిస్తే, దాని వయసును బట్టి రూ.2 లక్షల వరకు వస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లల ఉన్నత విద్య కోసం కూడా కొందరు వీటిని పెంచుతున్నారు.

News September 22, 2025

బండిపై క్యాస్ట్ పేరుంటే జరిమానా!

image

అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కుల వివక్షను రూపు మాపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. ‘క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్‌లో నేరస్థుల కులానికి బదులు పేరెంట్స్ పేర్లు పెట్టాలి. PSలో నిందితుల పేర్లు ప్రదర్శించేటప్పుడు కుల ప్రస్తావన వద్దు. వాహనాలపై కులం పేరు, కులాన్ని కీర్తిస్తూ స్లోగన్స్/కోట్స్ ఉంటే ఫైన్ వేయాలి. SMలో ఏ కులాన్నైనా కీర్తించినా/కించపరిచినా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.