News February 6, 2025

న్యూడ్ వీడియోల కేసు.. వారికి నోటీసులు!

image

అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిన్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం. వీడియోలో ఉన్న సినీ ప్రముఖులు, ఇతరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు.

Similar News

News February 4, 2026

APR 30న రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్: బుచ్చిబాబు

image

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. మార్చి 27న రావాల్సిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు బుచ్చిబాబు X వేదికగా ప్రకటించారు. షూటింగ్ పూర్తికాకపోవడంతో పాటు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 4, 2026

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

image

AP: చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. గుంటూరులోని అంబటి ఇల్లు, ఆఫీసును పరిశీలించారు. అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

News February 4, 2026

వచ్చే నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

image

TG: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని Dy.CM మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చే దిశగా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉగాది పండుగ రోజున (19న) అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వెల్లడించారు.