News February 12, 2025

మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గింది: కేంద్రం

image

గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 38కి తగ్గిందని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. నేషనల్ పాలసీ&యాక్షన్ ప్లాన్-2015 అమలు చేసినప్పటి నుంచి LWE ప్రభావిత ప్రాంతాల్లో 4,000kmsకి పైగా రోడ్లు నిర్మించామని తెలిపింది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి 1,300కి పైగా టెలికాం టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో LWE ప్రభావిత రాష్ట్రాలకు ₹1,925.83crs విడుదల చేశామని వివరించింది.

Similar News

News February 12, 2025

హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: హరీశ్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 16వేల మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

News February 12, 2025

జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లు.. ప్లానేంటో?

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ వంటి పిచ్‌లపై స్పీడ్ స్టార్లను వదిలేసి వరుణ్, కుల్దీప్, రవీంద్ర, అక్షర్, సుందర్‌ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాయంతో బుమ్రా దూరమవ్వగా శార్దూల్, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి మీ కామెంట్?

News February 12, 2025

సంక్షేమ పథకాల వల్ల కార్మికుల కొరత: L&T ఛైర్మన్

image

సంక్షేమ పథకాల వల్ల కార్మికుల కొరత ఏర్పడిందని L&T కంపెనీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. DBT వల్ల పనులు చేసేందుకు, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపట్లేదన్నారు. దీంతో వారిని నియమించుకోవడానికి కంపెనీలు చాలా కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమీకరణ, నియామకాల కోసం తమ కంపెనీ HR టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

error: Content is protected !!