News October 9, 2025

కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 40% తగ్గుదల

image

భారత్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య తగ్గింది. 2024లో మొదటి 9 నెలల్లో 3.61Cr ఖాతాలు తెరవగా, ఈ ఏడాది JAN-SEP మధ్య 2.18Cr అకౌంట్స్ యాడ్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40% తగ్గింది. 2024లో సగటున నెలకు 40లక్షల అకౌంట్లు నమోదు కాగా, 2025లో సగటున 24 లక్షల ఖాతాలు మాత్రమే తెరుచుకున్నాయి. ఏడాది కాలంగా పెద్దగా రిటర్న్స్ రాకపోవడం, IPOల తగ్గుదల వంటివి ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

Similar News

News October 9, 2025

ట్రంప్‌కు షా కౌంటర్!.. మామూలుగా లేదుగా!

image

నిన్న ZOHO మెయిల్ ఐడీ ఓపెన్ చేసిన అమిత్ షా ట్రంప్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు పోస్టులు వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ట్రంప్ భారత వస్తువులపై టారిఫ్స్ పెంచుతున్నట్లు ట్వీట్ చేస్తూ.. THANK YOU FOR YOUR ATTENTION TO THIS MATTER అని పోస్ట్ చేశారు. నిన్న అమిత్ షా స్వదేశీ ZOHO మెయిల్‌కు మారుతూ.. అచ్చం అలాగే ట్వీట్ చేశారు. భారతీయులు ZOHOకు మారితే అమెరికా టెక్ కంపెనీలకు పెద్దదెబ్బ పడటం ఖాయం.

News October 9, 2025

హిందూపురంలో మెగా జాబ్ మేళా

image

AP: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 10న హిందూపురంలోని SDGC ఎంబీఏ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీడాప్, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తారు. 15 మల్టీ నేషనల్ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకున్నవారు ముందుగా https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News October 9, 2025

చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

image

శరీరాన్ని ఆరోగ్యంగా, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్లనొప్పులు, ముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. జీర్ణవ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. దీనికోసం డైట్‌లో చేపలు, సిట్రస్‌ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, దాల్చినచెక్క, గ్రీన్‌టీ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#SkinCare<<>>