News October 25, 2024

ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక

image

AP: ఒడిశాలోని భితార్కానికా-ధమ్రా మధ్య దానా తుఫాను తీరం దాటింది. దీని ప్రభావం ఏపీపై తక్కువగా ఉన్నప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. ఉత్తరాంధ్రలోని కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Similar News

News January 3, 2025

సైబర్ ట్రక్ వల్లే పేలుడు తీవ్రత తగ్గింది: పోలీసులు

image

లాస్‌ వెగాస్‌లోని ట్రంప్ హోట‌ల్ వ‌ద్ద జ‌రిగిన పేలుడు తీవ్ర‌త‌ సైబ‌ర్‌ట్ర‌క్ కారు వ‌ల్ల‌ త‌గ్గింద‌ని పోలీసులు తెలిపారు. కారు స్ట్రక్చరల్ డిజైన్ వ‌ల్ల పేలుడు తీవ్ర‌త‌ పైకి ఎగ‌సిప‌డ‌డంతో దాని ప్రభావం త‌గ్గింద‌న్నారు. హోటల్ ముందు ఉన్న అద్దాలు ప‌గ‌ల‌క‌పోవ‌డమే దానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. నిందితుడిని ప‌ట్టుకోవ‌డంలో స‌ర్వేలైన్స్ ఫుటేజీని అందించి ఎలాన్ మస్క్ సాయం చేశార‌ని పోలీసులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

News January 3, 2025

నిద్ర పోతున్నప్పుడు ఫోన్ ఎక్కడ ఉంచాలంటే?

image

చాలామంది రాత్రి నిద్రపోయేముందు తమ ఫోన్‌ను దిండు కింద, చేయి దగ్గర ఉంచి నిద్రిస్తారు. కానీ ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రించడానికి 2 లేదా 3 గంటల ముందు ఫోన్‌ను మరో రూమ్‌లో పెట్టి పడకగదిలోకి వెళ్లాలి. మధ్యలో టైమ్, అలారమ్ కోసం కావాలనుకుంటే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఆ సమయంలోనూ కొన్ని అడుగుల దూరంలో పెట్టాలి. పడకమీద ఫోన్ చూడకూడదని మీరే గట్టిగా నిశ్చయించుకోవాలి.

News January 3, 2025

ప్రేమ కోసం పాక్‌కు.. ట్విస్ట్ ఇచ్చిన యువతి..!

image

ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్‌కు వెళ్లగా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన బాదల్ బాబు(30)కు పాక్‌కు చెందిన సనా రాణి(21)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు బాబు అక్రమంగా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ చేరుకున్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.