News March 19, 2024

రాయ్‌బరేలీ ఎంపీగా నుపుర్ శర్మ పోటీ?

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలకమైన రాయ్‌బరేలీ ఎంపీగా నుపుర్‌శర్మను బరిలోకి దింపాలని BJP నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమె గతేడాది టీవీ ఛానల్ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకోవడంతో ఆమెను రాయ్‌బరేలీలో పోటీ చేయించాలని BJP భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 30, 2026

400 మీటర్లకు రూ.18వేల ఛార్జ్.. ఆటో డ్రైవర్ అరెస్ట్

image

అర్జెంటీనా అరియానో అనే అమెరికన్ టూరిస్ట్‌కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టు నుంచి 400 మీటర్ల దూరంలోని హోటల్‌కు తీసుకెళ్లడానికి ఆటోడ్రైవర్ ఏకంగా ₹18,000 తీసుకున్నట్లు ఆటో నంబర్ రికార్డు చేసి మరీ Xలో పోస్ట్ చేశారు. చాలాసేపు ఆటోలో తిప్పాడని, పైగా మధ్యలో ఆపి డబ్బిచ్చిన తర్వాతే హోటల్లో దిగబెట్టాడని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు అతణ్ని దేశ్‌రాజ్ యాదవ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

News January 30, 2026

T20WCలో 300 స్కోర్.. ఆ రెండు జట్లకు సాధ్యమే: రవిశాస్త్రి

image

T20WCలో 300 పరుగుల మార్క్‌ను భారత్, ఆస్ట్రేలియాలు సాధించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆ జట్లలో విధ్వంసకర ప్లేయర్లు ఉన్నారని, టాపార్డర్‌లో ఒకరు సెంచరీ చేస్తే టీమ్ స్కోర్ 300కు చేరుతుందని పేర్కొన్నారు. కాగా T20WCలో శ్రీలంక అత్యధికంగా 260/6 స్కోర్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ENG(230), SA(229), IND(218) ఉన్నాయి. T20Iలలో ZIM 344, NEP 314, ENG 304 రన్స్ చేశాయి.

News January 30, 2026

నేను వెళ్లను.. పుతిన్‌నే రమ్మనండి: జెలెన్‌స్కీ

image

శాంతి చర్చల కోసం మాస్కోకు రావాలంటూ <<18997519>>రష్యా పంపిన ఆహ్వానాన్ని<<>> ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. ‘ట్రంప్, పుతిన్‌ను కలిసేందుకు నేను రెడీ. రష్యా తప్ప ఏ దేశానికైనా చర్చలకు వెళ్తా. నేనే పుతిన్‌ను కీవ్‌కు ఆహ్వానిస్తున్నా. ఆయన్ను రానివ్వండి.. అదీ ధైర్యం చేయగలిగితే’ అని అన్నారు. తాము యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నామని, ఉద్రిక్తతలను తగ్గించే చర్యలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.