News July 11, 2024
అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు: మంత్రి సీతక్క

TG: అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్‌పై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫాంలు అందిస్తామన్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’ పేరుతో జులై 15 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం చేపడుతామన్నారు.
Similar News
News November 20, 2025
స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.
News November 20, 2025
ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.


