News July 7, 2024

త్వరలో ‘ప్యాకేజ్డ్ ఫుడ్’పై పెద్ద అక్షరాల్లో పోషకాల సమాచారం!

image

ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తువులపై పోషక సమాచారాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించాలనే నిబంధనలను FSSAI తీసుకురానుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు తదితర పదార్థాలు ఎంత మొత్తంలో ఉన్నాయనే వివరాలను పెద్దగా, బోల్డ్ ఫాంట్‌లో ఉంచాలని ప్రతిపాదించింది. దీనిపై ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసి వివిధ వర్గాల స్పందన కోరనుంది. ఇది అమల్లోకి వస్తే ఉత్పత్తుల్లోని పోషకాల గురించి యూజర్లు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.

Similar News

News October 14, 2024

ఈ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువ: మంత్రి నారాయణ

image

AP: చెన్నై-నెల్లూరు మధ్య ఈనెల 17న తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, TRPT, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు.

News October 14, 2024

నటి కారుకు యాక్సిడెంట్‌.. తీవ్ర గాయాలు

image

బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి పలు సీరియల్స్‌, టీవీ షోల్లోనూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

News October 14, 2024

కులగణనపై ఈనెల 24 నుంచి అభిప్రాయ సేకరణ

image

TG: కులగణనపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. కులగణన కార్యాచరణపై ఇవాళ తొలిసారి సమావేశమైంది. ప్రణాళిక శాఖతో కలిసి కులగణన చేయాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి, వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనుంది. వాటిని అధ్యయనం చేసిన అనంతరం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించనుంది.