News October 29, 2025

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News February 12, 2026

2027 వరకు జిల్లాల మార్పు ఉండదు: రేవంత్

image

TG: జిల్లాల రద్దు ఉండదని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ తాజాగా.. 2027 వరకు జిల్లాల మార్పు ఉండదని పేర్కొన్నారు. అప్పుడు డీలిమిటేషన్‌తో పాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో అన్నారు. అప్పటివరకు.. అంటే పదిన్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

News February 12, 2026

నేనే రాజు.. నేనే మంత్రి: రేవంత్ రెడ్డి

image

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో TG సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి. నాకు ఎవరూ పోటీ కాదు. పదిన్నరేళ్లు సీఎంగా ఉంటాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి పాపపు పనులు తాను చేయనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అందరూ ఒకటేనని, టీఆర్ఎస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని వ్యాఖ్యానించారు.

News February 12, 2026

‘ఖేలో ఇండియా’ నుంచి 1,342 మంది అథ్లెట్ల తొలగింపు

image

ఖేలో ఇండియా ప్రోగ్రామ్ నుంచి గత 3ఏళ్లలో 1,342 మంది అథ్లెట్లను తొలగించినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. లో పర్ఫార్మెన్స్, డోపింగ్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని చెప్పారు. 3ఏళ్లలో 2,905 మంది కొత్తగా చేరారని తెలిపారు. స్పోర్టింగ్ టాలెంట్‌ను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతం 23K+ మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.