News March 20, 2025
మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్.. స్పందించిన ఎన్వీఎస్ రెడ్డి

TG: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ విషయం తన దృష్టికి వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు అనైతికమని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్ను మెట్రోలో నిషేధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 23, 2026
2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్లోని <
News January 23, 2026
లక్ష్మీదేవి కొలువై ఉండే పదార్థాలు ఇవే..

శాస్త్రాల ప్రకారం పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, వీటిని గౌరవిస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచుకునే వారిపై ఆమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వస్తువుల పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సోమరితనం, కలహాలు ఉన్న చోట లక్ష్మి నిలవదని చెబుతున్నారు. వాటి పట్ల గౌరవంగా వ్యవహరిస్తే సంపద, ఐశ్వర్యం నిలకడగా ఉంటాయి.


