News April 25, 2025
ఉగ్రదాడిని మిలిటెంట్ల దాడిగా పేర్కొన్న NYT.. US ఆగ్రహం

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని న్యూయార్క్ టైమ్స్(NYT) పత్రిక మిలిటెంట్ల దాడిగా పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం మండిపడింది. ఇండియా/ఇజ్రాయెల్ లేదా మరేచోటైనా టెర్రరిజం విషయానికి వచ్చేసరికి NYT వాస్తవాల నుంచి దూరం జరుగుతుందని ఫైరయ్యింది. ఈ మేరకు US ఫారిన్ అఫైర్స్ కమిటీ Xలో పోస్టు చేసింది. ఆ పత్రిక క్లిప్పింగ్‌లో మిలిటెంట్లుగా పేర్కొన్న భాగాన్ని కొట్టేసి టెర్రరిస్టులుగా మార్పు చేసింది.
Similar News
News April 25, 2025
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే: గౌతమ్ రావు

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన గౌతమ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు కాంగ్రెస్ సహకరించిందని ఆరోపించారు. కార్పోరేటర్లు ఓట్లు వేయకుండా అడ్డుకున్న BRSను ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, MIM చెప్పినట్లుగా కాంగ్రెస్ చేస్తోందన్నారు.
News April 25, 2025
టెర్రరిస్ట్-మిలిటెంట్.. ఏంటి తేడా?

విశ్లేషకుల ప్రకారం.. హింసతో సమాజంలో భయం కల్గించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికస్థితి తదితరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం (టెర్రరిజం). దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. సామాజిక, రాజకీయ లక్ష్యాలతో హింసకు పాల్పడేవారు తీవ్రవాదులు (మిలిటెంట్స్). రెండూ హింస మార్గాలే, కానీ ఉద్దేశాలు వేరు. పహల్గాం దాడి ‘మిలిటెంట్ అటాక్’ అన్న <<16207620>>NYTపై<<>> USA ప్రభుత్వం ‘ఇది టెర్రరిస్ట్ అటాక్’ అని కౌంటరిచ్చింది.
News April 25, 2025
BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, BRS దూరంగా ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో నిలిచాయి. మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు పోలయ్యాయి.