News October 16, 2024

NZB:త్వరలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క

image

చాలాకాలంగా పెండింగ్లో ఉన్న NZB, అదిలాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్రమంత్రి సీతక్క తెలిపారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్​ మెంట్​ లెటర్స్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 8, 2024

NZB: రైతులకు 48 గంటల్లోపు బిల్లుల చెల్లింపులు: కలెక్టర్

image

నిబంధనలకు అనుగుణంగా 48 గంటల్లోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా ఓపీఎంఎస్‌లో డాటా ఎంట్రీ చేయిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. రైతులకు సన్న ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2320 ముందుగా చెల్లిస్తామని తెలిపారు. అనంతరం రూ.500 బోనస్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.

News November 8, 2024

BREAKING: ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

image

లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఓ రైతు నుంచి రూ.20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ పట్టుబడడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2024

భీమ్‌గల్లో విషాదం.. ఇంటిపై నుంచి పడి రెండేళ్ల పాప మృతి

image

భీమ్‌గల్ పట్టణంలో గురువారం విషాదం నెలకొంది. మోయిజ ఆనం అనే రెండేళ్ల చిన్నారి ఇంటి దాబాపై నుంచి పడి మరణించింది. నందిగల్లిలో చిన్నారి తన ఇంటి దాబాపై ఆడుకుంటుండగా.. దానికి పిట్ట గోడ లేనందున ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయాలు అయి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు .