News February 17, 2025
NZBలో అమ్మవారి ముక్కపుడక చోరీ

నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గొల్లగుట్ట తాండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం తాళాలు పగులకొట్టిన దొంగలు అమ్మవారి బంగారు ముక్కు పుడక ఎత్తుకెళ్లారు. ఈ మేరకు గ్రామస్థులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 27, 2025
అమరావతి: ‘రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సహకరిస్తాం’

CM చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడారు. రాజధాని కోసం JACలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించామని, ఇక అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటామన్నారు. 2వ విడత భూసమీకరణకు పూర్తిగా సహకరిస్తామని, CM రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకు మేలు జరుగుతుందని, ల్యాండ్ పోలింగ్కు ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.
News November 27, 2025
సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 207 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 1,442 వార్డులకు 38 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ తెలిపారు.
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.


