News August 11, 2024
NZBలో వ్యక్తి అదృశ్యం.. బాసరలో మృతదేహం లభ్యం
నిజామాబాద్‌లో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం బాసరలో లభ్యమైనట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వినాయక్ నగర్‌కు చెందిన కల్లెపల్లి రాజు(36) ఈ నెల 3న కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రాజు ఆచూకీ కోసం గాలించగా ఆదివారం బాసరలోని గోదావరి నదిలో శవమై కనిపించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News September 16, 2024
భీమ్‌గల్: ఆటో బోల్తా.. బాలుడి మృతి
భీమ్‌గల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్ నుంచి సంతోశ్‌నగర్ తండాకు 5గురు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా రియాన్ అనే బాలుడి తలకు గాయమైంది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
News September 16, 2024
NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.
News September 16, 2024
ఫిలిప్పీన్స్‌లో వేల్పూర్ యువకుడి మృతి
ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలానికి చెందిన అక్షయ్ మృతి చెందాడు. అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరో ఐదు నెలలో ఎంబీబీఎస్ కావస్తున్న సమయంలో అక్షయ్ ఆకస్మిక మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.