News February 17, 2025

NZBలో అమ్మవారి ముక్కపుడక చోరీ

image

నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గొల్లగుట్ట తాండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం తాళాలు పగులకొట్టిన దొంగలు అమ్మవారి బంగారు ముక్కు పుడక ఎత్తుకెళ్లారు. ఈ మేరకు గ్రామస్థులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 18, 2025

కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారిగా ప్రసన్న వెంకటేశ్

image

కలెక్టర్ల రెండో రోజు సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. కాకినాడ జిల్లా బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్‌కు అప్పగించింది. జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అమలు చేయడం లక్ష్యంగా ఆయన విధులు నిర్వహించనున్నారు.

News December 18, 2025

సౌత్‌లో పొల్యూషన్‌ లేదు.. అక్కడ మ్యాచ్‌లు ఆడొచ్చు: శశిథరూర్

image

తీవ్ర పొగమంచు కారణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాదిలో మ్యాచ్‌లు ఆడొచ్చు. ఎందుకంటే అక్కడ కాలుష్యం, విజిబిలిటీ సమస్య లేదు. అభిమానులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఎందుకు షెడ్యూల్ చేయాలి? బదులుగా సౌత్‌లో నిర్వహించాలి’ అని సూచించారు.

News December 18, 2025

అనకాపల్లి: 19న రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు

image

రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు ఈనెల 19న విజయవాడ కృష్ణా నది ఒడ్డున నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ తెలిపారు. ఖేలో ఇండియా-2వ విడతలో పురుషులు, మహిళల ఓపెన్ క్యాటగిరి విభాగంలో కబాడీ, వాలీబాల్, సెపక్ తక్ర పోటీలు జరుగుతాయని అన్నారు. విజేతలు జనవరి 5 నుంచి 10 వరకు దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.