News March 23, 2025
NZB: అంతర్జాతీయ పోటీలకు విద్యార్థిని ఎంపిక

భారత అండర్-15 సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగే సాఫ్ట్ బాల్ పోటీల్లో డిచ్పల్లి మండలం సుద్దులం గురుకుల పాఠశాలకు చెందిన గన్న హర్షిని పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, తిరుపతి పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
SRSP UPDATE: 8 గేట్ల ద్వారా నీటి విడుదల

SRSP నుంచి సోమవారం 9 గంటలకు 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడిచిపెట్టినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 84,790 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా 84,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తిగా 80.501TMC ల నీరు నిల్వ ఉందని వివరించారు.
News October 13, 2025
ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు: ఆర్మూర్ ఎమ్మెల్యే

దీపావళి పండగకు టపాసుల దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చలాన్లు కట్టి దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 12, 2025
నిజామాబాద్: DCC పదవికి దరఖాస్తు చేసుకున్న వేణుగోపాల్ యాదవ్

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పీసీసీ అధికార ప్రతినిధి కమ్మర్‌పల్లికి చెందిన సీనియర్ నాయకుడు బాస వేణుగోపాల్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ నిర్మాణ పటిష్టత కోసం నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. జిల్లా అబ్జర్వ్గా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.