News January 22, 2025

NZB: అడవిపంది దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

image

అడవిపంది దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ఎడ్దూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పంట చేలల్లో మంగళవారం గొర్రెలు మేపుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన శివ సాయిపై అడవిపంది దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.