News July 10, 2024
NZB: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అత్తింటి వేధింపులు తాళలేక నిజామాబాద్ ఆర్యనగర్కు చెందిన వివాహిత యువతి లావణ్య(23) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు తొమ్మిది నెలల కిందట ఆర్యనగర్కు చెందిన వెంకటేశ్తో వివాహం జరిగింది. ఆషాఢం కావడంతో సుభాష్ నగర్లోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
BREAKING: నిజామాబాద్: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.
News February 8, 2025
NZB: వాహనాలు నడుపుతున్నారా..? నిబంధనలు పాటించాల్సిందే!
వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT
News February 8, 2025
కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడి గల్లంతు
కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.