News January 11, 2025
NZB: అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశానిర్దేశం చేశారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని సూచించారు.
Similar News
News October 27, 2025
NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్‌లు దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.
News October 26, 2025
కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.
News October 26, 2025
నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్ నగర శివారులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.


