News September 13, 2024
NZB: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు: DEO

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News November 20, 2025
SRSP 24 గంటల్లో 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు పోతుండగా సరస్వతీ కెనాల్కు 650, మిషన్ భగీరథకు 231 వదిలామన్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
News November 20, 2025
ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
News November 20, 2025
నిజామాబాద్: NPOs/NGOs దరఖాస్తు చేసుకోవాలి: DYSO

2025-26 సంవత్సరానికి జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం (NPYAD) పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ (ఆర్థిక సహాయం) కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO పవన్ కుమార్ తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన లాభాపేక్షలేని సంస్థలు (NPOs/NGOs) నుంచి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


