News January 17, 2025

NZB: అబద్ధాలు చెప్పి CM కాలం గడుపుతున్నారు: MLA వేముల

image

సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం TG భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు.. 400 రోజులైనా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు.

Similar News

News November 13, 2025

NZB: నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీల నియామకం

image

తెలంగాణ జాగృతి విస్తరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీలను కవిత ప్రకటించారు. ఈ మేరకు అర్బన్ కమిటీ సభ్యులుగా కరిపే రాజు, యెండల ప్రసాద్, రెహన్ అహ్మద్, ఇరుమల శంకర్, పంచరెడ్డి మురళీ, అంబాటి శ్రీనివాస్ గౌడ్, సాయికృష్ణ నేత, షానావాజ్ ఖాన్, రూరల్ నరేష్ నాయక్, బాణోత్ ప్రేమ్ దాస్, ఆర్మూర్ నుంచి ఏలేటి నవీన్ రెడ్డి, మనోజ్ రావు, ఆజమ్, బాల్కొండకు మహేందర్ రెడ్డి, ధీరజ్‌లను నియమించారు.

News November 13, 2025

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై NZB కలెక్టర్ సమీక్ష

image

NZB కలెక్టరేట్‌లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి MPDOలు, హౌసింగ్ AEలు, MPOలు, GP కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణాల్లో వెనుకంజలో ఉన్న వివిధ మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు.

News November 12, 2025

తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అడ్ హక్ కమిటీ నియామకం

image

తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా జిల్లా అడ్ హక్ కమిటీని బుధవారం కవిత ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కమిటీ సభ్యులుగా సూదం రవిచందర్, అవంతి కుమార్, ఎంఏ రజాక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, రెహన్ అహ్మద్, విజయలక్ష్మి, నవీన్ నియమితులయ్యారు. అదే విధంగా జిల్లా అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, ద్యావాడే సంజీవ్, శేఖర్ రాజ్, సంతోష్ నాయక్, తిరుపతి, రాములును నియమించారు.