News October 23, 2024

NZB: అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం పోస్ట్‌పోన్ తేదీలు ఇవే..!

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

Similar News

News November 9, 2024

KMR: బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

image

బాలికను స్కూల్ టీచర్ లైంగికంగా వేధించిన ఘటన బిక్కనూర్‌లో వెలుగుచూసింది. ఓ పాఠశాల విద్యార్థిని మండలానికి చెందిన టీచర్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడు. కాచ్చాపూర్ ఓ మాజీ ప్రజాప్రతినిధి విషయం బయటికి రాకుండా సంధి చేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా న్యాయసేవ సంస్థ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి DSP నిందితుడితో పాటు HM కాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీపై కేసు నమోదు చేశారు.

News November 9, 2024

నిజామాబాద్‌లో లారీ క్లీనర్ హత్య

image

వ్యక్తి హత్యకు గురైన ఘటన NZBలో జరిగింది. మద్నూర్‌కి చెందిన లక్ష్మణ్(30) లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. శుక్రవారం కాలూరు కూడలి వద్ద తీవ్ర గాయాలతో పడిఉన్న లక్ష్మణ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడిని ఎవరో తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాతకక్షలు నేపథ్యంలో హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

News November 9, 2024

కామారెడ్డి: ప్రతి ఇల్లు హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఏ ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో మండల ప్రత్యేక అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ చేశారా, లేదా అనేవి మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలన్నారు.