News December 18, 2024

NZB: అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచి ఉంచిన ముగ్గురికి జైలు శిక్ష

image

అర్ధరాత్రి వరకు హోటల్లు తెరిచి ఉంచిన ముగ్గురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు వన టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఒలంపియా బేకరీ యజమాని షేక్ అమాన్, స్టార్ హోటల్ యజమాని అస్లాం, న్యూ ప్యారడైస్‌కు చెందిన అత్నూర్ అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరచగా అస్లాం, అత్నుస్‌కు ఒకరోజు, అమన్‌కు 2 రోజుల జైలు శిక్ష విధించారు.

Similar News

News November 15, 2025

NZB: ప్రభుత్వ సలహాదారుని కలిసిన ఉద్యోగ సంఘాలు

image

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి శనివారం వచ్చిన బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 15, 2025

నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

image

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

News November 15, 2025

NZB: 17న జరిగే పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయండి

image

ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. శనివారం వారు 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల బకాయిల సత్వర చెల్లింపులు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు జరిపే ధర్నా కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. శ్రీధర్, నర్సింహస్వామి, బన్సీలాల్ పాల్గొన్నారు.