News April 16, 2025
NZB: ‘అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు’

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్ధేశంతో కొందరు సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News April 22, 2025
నిజామాబాద్: 59.25 శాతం ఉత్తీర్ణత: DIEO

ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాలో 59.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. వార్షిక పరీక్షల్లో జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు.
News April 22, 2025
NZB: జిల్లా నూతన జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన G.V.N. భరతలక్ష్మిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పువ్వుల మొక్కను అందజేశారు. ఇరువురు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను నూతన జడ్జీకి సీపీ వివరించారు.
News April 22, 2025
UPDATE: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎంతమంది పాసంటే?

ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయినట్లు DIEO తెలిపారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారని వివరించారు.