News March 12, 2025
NZB: అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా?: కవిత

అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. సర్పంచ్‌లను కలిసేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారన్నారు.
Similar News
News March 13, 2025
NZB: నేడు సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు

నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, గంగారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన జిల్లా జట్టును ఈ నెల 16 నుంచి 18 వరకు కరీంనగర్‌లోని హుజూరాబాద్‌లో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌కు పంపుతామన్నారు.
News March 12, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడి దుర్మరణం

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు దుర్మరణం చెందాడు. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన చిట్టెం హనుమాండ్లు(54) NZBలో గోల్ హనుమాన్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించేవారు. బైక్‌పై తన దగ్గర పని చేసే శ్రీహరితో కలిసి వెళ్తుండగా పులాంగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో హనుమాండ్లు మృతి చెందగా శ్రీహరికి గాయాలయ్యాయి.
News March 12, 2025
NZB: 477 మంది గైర్హాజరు

జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ 2వ సంవత్సరం బోటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-2ఏ పరీక్షకు మొత్తం 477 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారన్నారు.