News July 12, 2024
NZB: ఆందోళన కలిగిస్తోన్న కుక్కల బెడద

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ వారి సంఖ్య ఆందోళన గలిగిస్తోంది. 2023 డిసెంబరులో నిజామాబాద్ జిల్లాలో382 కుక్క కాటు కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లలో 56 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో NZBలో 376, KMRలో 32, ఫిబ్రవరిలో NZBలో 326, KMRలో 44, మార్చిలో NZBలో 326, KMRలో 38, ఏప్రిల్ లో NZBలో 335, KMRలో 40, మే నెలలో NZBలో 243, KMRలో 28 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.
Similar News
News December 12, 2025
NZB: సర్పంచిగా గెలిచాడు.. అంతలోనే విషాదం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది సంబరాలు చేసుకుంటున్న సమయంలో సర్పంచి తల్లి మృతి చెందింది. రుద్రూర్ మండలం రాణంపల్లి సర్పంచిగా కే.శంకర్ గెలుపొందాడు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన తల్లి లింగవ్వకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 12, 2025
నిజామాబాద్ జిల్లాలో 7.3°C అత్యల్ప ఉష్ణోగ్రత

NZB జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో సాలుర 7.3°C, చిన్న మావంది 7.6, కోటగిరి 8.3, జకోరా, గోపన్నపల్లి 8.9, పొతంగల్ 9, కల్దుర్కి 9.2, మదన్ పల్లె 9.5, చందూర్, మంచిప్ప 9.6, బెల్లాల్ 9.7, డిచ్పల్లి, మోస్రా 9.8, ఎడపల్లి, మెండోరా, రుద్రూర్ 9.9, నవీపేట్, పాల్దా, నిజామాబాద్, గన్నారం 10°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News December 12, 2025
NZB: నేటి నుంచి నిషేధాజ్ఞలు: CP

ఈ నెల 14 న నిజామాబాద్ డివిజన్లో నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం శుక్రవారం నుంచి 163 BNSS ఉత్తర్వులు జారీ చేసినట్లు CPసాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్లోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు.


