News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 26, 2025
18 మృతదేహాలు అప్పగింత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 19మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరిలో 18 మృతదేహాలను DNA పరీక్షల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఓ గుర్తుతెలియని మృతదేహం కోసం చిత్తూరు(D) నుంచి ఒకరు వచ్చారని SP విక్రాంత్ తెలిపారు. తన తండ్రి కనిపించడంలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు వివరించారు. DNA ఆధారంగా ఆ డెడ్‌బాడీ ఎవరిదన్నది తేలుతుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని పేర్కొన్నారు.
News October 26, 2025
గుంటూరు GMCలో మొంథా తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో గుంటూరు నగరంలో తలెత్తే సమస్యలపై ఫిర్యాదుల కోసం జీఎంసీ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 0863-2345103, వాట్సాప్ నంబర్ 9849908391ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు.
News October 26, 2025
చిత్తూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు సెలవు పాటించాలని అందులో ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను నదులు, కాలువలు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.


