News February 1, 2025
NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు

ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్‌కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.
Similar News
News November 4, 2025
పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి: NZB కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అన్ని మండలాల ఎంఈఓలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు.
News November 4, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
News November 4, 2025
NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

వానకాలం సీజన్‌కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.


