News February 1, 2025
NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు

ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్‌కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.
Similar News
News February 17, 2025
KMR: అన్న బెదిరింపు.. హత్య చేసిన తమ్ముళ్లు

మేడ్చల్‌లో సంచలనం రేపిన <<15484237>>హత్య<<>> కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్(25), రాకేశ్, లక్ష్మణ్ అన్నదమ్ములు. మద్యానికి బానిసైన ఉమేశ్ వేధింపులు తాళలేక అతడిని దుబాయ్ పంపుదామని ఇంట్లో ప్లాన్ చేశారు. ఇష్టంలేని అతడు ఆ ప్లాన్ చెడగొట్టాడు. ఆదివారం ఇంట్లో ఉన్న తమ్ముళ్లను బెదిరించడంతో వాళ్లు ఎదురుతిరిగారు. ఉమేశ్ పారిపోతుండగా నడిరోడ్డుపై అతడిని దారుణంగా చంపేశారు.
News February 17, 2025
ముప్కాల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామ శివారులోని చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. తెలుపు & బూడిద రంగు డబ్బాల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎత్తు 5.6 అంగులాలు ఉన్నట్లు వెల్లడించారు. వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
News February 17, 2025
NZB: అమ్మవారి ముక్కపుడక చోరీ

నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గొల్లగుట్ట తాండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం తాళాలు పగులకొట్టిన దొంగలు అమ్మవారి బంగారు ముక్కు పుడక ఎత్తుకెళ్లారు. ఈ మేరకు గ్రామస్థులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు.