News October 25, 2024
NZB: ఆదిలాబాద్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారుకు ప్రమాదం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం పద్మాజీవాడ ఫ్లై ఓవర్ వద్ద ఆయన ఫార్చూనర్ కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కాగా ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆయన ఆదిలాబాద్ ప్రయాణమయ్యారు.
Similar News
News November 4, 2024
లింగంపేట్: ఉపాధ్యాయులుగా అన్నాచెల్లెళ్ల ఎంపిక
మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు కొండా సంజీవ్, శ్యామల స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్లుగా ఒకేసారి ఎంపికయ్యారు. ఇద్దరూ బీబీపేట్ మండలంలోని పలు పాఠశాలల్లో జాయిన్ అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తమను ప్రోత్సహించి సహకరించిన వారికి వారిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఒకేసారి ఉద్యోగాలు సాధించిన వారిని గ్రామస్థులు అభినందించారు.
News November 4, 2024
నిజామాబాద్ జిల్లాలో నేడు మీ సేవలు బంద్
సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు జిల్లా మీ సేవ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు.
News November 4, 2024
ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలి: మందకృష్ణ
మాదిగలు అండగా నిలిచారని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొన్నారు. వర్గీకరణ అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.