News March 1, 2025
NZB: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని DIEO రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్లు హాల్ టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్లను ఆదేశించారు.
Similar News
News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
News November 19, 2025
నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

నిజామాబాద్ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 19, 2025
NZB: స్వాధార్ గృహంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: సబ్ కలెక్టర్

బోధన్ పట్టణంలోని స్వాధార్ గృహంను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలతో కలిసి సందర్శించారు. నివాసితుల వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు.


