News October 5, 2024
NZB: ఆన్లైన్ బెట్టింగ్… ముగ్గురు ఆత్మహత్య!

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Similar News
News April 18, 2026
NZB: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్‌లను నియమించారు.
News April 17, 2026
TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.
News April 17, 2026
LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.


