News July 10, 2024
NZB: ఆన్లైన్ మోసం..ఫోన్‌కు బదులు బెల్ట్
ఫోన్‌కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే బెల్ట్ వచ్చిన ఘటన నవీపేట మండలం శివతండాలో జరిగింది. గ్రామస్థుల ప్రకారం.. రైతు జీవన్‌కు గతనెల 10న ఓ ఆన్లైన్ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 25వేల ఫోన్..మీకు లక్కీ డ్రాలో రూ.5 వేలకు వచ్చిందని చెప్పారు. దీంతో రైతు సమ్మతించారు. నిన్న ఆర్డర్బాక్స్ను పోస్ట్‌మెన్ జీవన్‌కు ఇచ్చి రూ.5 వేలు తీసుకున్నాడు. డబ్బాను తెరిచి చూడగా అందులో బెల్ట్ ఉండటంతో రైతు అవాక్కయ్యాడు.
Similar News
News February 8, 2025
NZB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
News February 8, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం
KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
News February 8, 2025
BREAKING: నిజామాబాద్: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.