News February 18, 2025
NZB: ఆరుగురి హత్య.. కోర్టు సంచలన తీర్పు

నిజామాబాద్ జిల్లాలో 2023లో సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసులో జిల్లా కోర్డు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రశాంత్, అతని తల్లి వడ్డేమ్మకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తీర్పును వెలువరించారు. 2023లో మాక్లూర్ మండల కేంద్రంలో ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆస్తిని అతని స్నేహితుడు ప్రశాంత్ కాజేసేందుకు కుట్ర చేశాడు. ఇందుకు ఆరుగురిని హత్య చేశాడు.
Similar News
News February 22, 2025
నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.
News February 22, 2025
KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బిక్కనూర్లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం తన అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆరుబయట పడుకోవడంతో తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపిన లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 22, 2025
NZB జిల్లాలో వరుస గుండెపోట్లు

ఉమ్మడి NZBలో వరుస గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. 2రోజుల్లో బడికెళ్లే బాలిక, కూతురి పెళ్లిలో తండ్రి ఇలా ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు రావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలాంటి అనారోగ్య కారణాలు లేనివారు గుండెపోటుకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్య అలవాట్లు మెయిన్టేన్ చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు.