News March 23, 2025

NZB: ఆరుగురు మృతి.. 17 మందిపై కేసులు

image

నిజామాబాద్ జిల్లాలో శనివారం తీవ్ర విషాదం నింపింది. ఒక్కరోజే వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, అలాగే పలు ఘటనల్లో 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి, వాహనం ఢీకొని, గొడవ పడటవంతో హత్య, జ్వరంతో యువకుడు, చెట్టు పైనుంచి పడి, నిజాంసాగర్ కాలువ వద్ద ఒకరు మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలాగే జూదం, న్యూసెన్స్ ఘటనల్లో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Similar News

News April 24, 2025

భగ్గుమంటున్న నిజామాబాద్.. జర జాగ్రత్త

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

News April 24, 2025

బోధన్: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: కలెక్టర్

image

బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ మీటింగ్ హల్‌లో బుధవారం భూ భారతిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. భూ భారతి సేవల గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

News April 23, 2025

కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో భిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో భిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!