News March 22, 2025
NZB: ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఛైర్మన్గా ఈగ సంజీవ్

ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏథిక్స్ డిసిప్లేన్ చైర్మన్గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఒక ప్రకటన లో తెలిపారు. సంజీవ్ రెడ్డి ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ అంద్యాల లింగయ్యా, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 10, 2026
నిజామాబాద్: రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పొతంగల్ (M) కొడిచర్లకు చెందిన సాయికుమార్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. జక్రాన్ పల్లి(M) పడకల్కు చెందిన తలారి నరేందర్ (35) సైతం ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. ఆలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్(M) 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ పవార్ (40) దుర్మరణం పాలయ్యాడు.
News January 9, 2026
టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.
News January 9, 2026
బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


