News August 13, 2024
NZB: ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏజెంట్లను నియమించనున్నట్లు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాలకు ఆర్మూర్-73968 89496, బోధన్- 90142 96638, నిజామాబాద్-1 91542 98727, నిజామాబాద్-2 73968 89496, బాన్సువాడ 91542 98729, కామారెడ్డి 91542 98729 సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 20, 2025
బోధన్: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు

బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.
News December 20, 2025
NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
News December 20, 2025
NZB: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్లో 9, బోధన్లో 4, ఆర్మూర్లో 2 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.


