News March 21, 2024
NZB: ‘ఆ ఆయుధాలు పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి’

లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక వెలువడిన నేపథ్యంలో NZB సీపీ కల్మేశ్వర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ARMS లైసెన్స్ పొంది ఉన్న వారు ఆయుధాలను సంభందిత పోలీస్ స్టేషన్‌లలో ఈ నెల 23 లోపు జమ చేయాలన్నారు. మినాహాయింపు పొందాలనుకుంటే ARMS జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 26, 2026
BREAKING: నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను TGSPDCL ఛైర్మన్&MDగా బదిలీ చేశారు.
News February 26, 2026
NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయని తెలిపారు.
News February 26, 2026
NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయన్నారు.


