News October 21, 2024
NZB: ఆ ఎంపీలు చేసిందేమీ లేదు: మధు యాష్కీ

తన తరువాత ఎంపీ కవిత, ప్రస్తుత ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ.. తాను 10 ఏళ్లపాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు పాస్ పోర్ట్ కార్యాలయం, యూనివర్సిటీ, మెడికల్ కళాశాల తీసుకువచ్చానని, ఆ తర్వాత చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు.
Similar News
News December 10, 2025
TU: డిగ్రీ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

టీయూ పరిధిలోని డిగ్రీ-సీబీసీఎస్- I, III ,V సెమిస్టర్ (రెగ్యులర్), II, IV, VI సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 18వ రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 83 మంది విద్యార్థులకు 72 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
News December 10, 2025
NZB: మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు.
News December 10, 2025
NZB: ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు: కలెక్టర్

ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేప్పుడు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఓటర్, ఆధార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ పాస్ బుక్లు తీసుకెళ్లాలన్నారు.


