News March 24, 2025

NZB: ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది గైర్హాజరు: డీఈవో

image

2025 పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 22,735 మంది విద్యార్థులకు 22,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో అధికారికంగా వెల్లడించారు.

Similar News

News April 3, 2025

ఆర్మూర్: భూములను యూనివర్సిటీకి అప్పగించండి: ఎంపీ

image

BRS పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే పరిస్థితిపై వివరించారు. భూములు ప్రైవేట్ పరుల చేతుల్లో వెళ్లకుండా 400 ఎకరాలు భూమిని కాపాడాలని కోరారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని కోరారు. విద్యార్థులుపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

News April 3, 2025

NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.

News April 3, 2025

NZB: కాంగ్రెస్, బీజేపీలపై MLC కవిత ధ్వజం

image

X వేదికగా కాంగ్రెస్, బీజేపీలపై బుధవారం నిజామాబాద్ MLC కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆమోదించిన చ‌ట్టాల‌ను కోల్డ్‌ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లేతో బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ డ్రామా ఆడారన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం చేశారన్నారు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధ‌ర్నాకు హాజరు పేరిట మమా అనిపించారన్నారు.

error: Content is protected !!