News February 14, 2025
NZB: ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్‌కు టీయూ P.D

హైదరాబాద్ వేదికగా ఈ నెల 15 నుండి 16 వరకు జరగనున్న ‘ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ 2025’లో తెలంగాణ యునివర్సిటీ వ్యాయామ విద్యలో సహాయ ఆచార్యులు(సి)గా పని చేస్తున్న డాక్టర్.బి.ఆర్.నేతకు చోటు లభించింది. ఇందుకు ఆయన టీయూ వైస్ ఛాన్సలర్ ప్రో.టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో.యాదగిరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నేతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 28, 2025
NZB: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి: పోచారం

వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు.
News March 28, 2025
NZB: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్‌లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
NZB: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: డీఈవో

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒంటి పూట బడుల నేపథ్యంలో రెండు పూటల బడులు నిర్వహించే పాఠశాలల పై ఎటువంటి నోటీసులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు వేసవి కాలంలో రెండు పూటలు బడులు నిర్వహిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలకు ఆయన సూచనలు చేశారు.