News March 17, 2025
NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు మొత్తం 831 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, నేటి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.
Similar News
News March 18, 2025
NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు.
News March 18, 2025
KMR: వైకల్యాన్ని ఓడించి..ఉద్యోగం సాధించి..! అంతే గాక..

ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు జుక్కల్ మండలం మొహ్మదాబాద్ వాసి ముక్తబాయి. పుట్టుకతోనే అంధురాలైనా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఇటీవల గ్రూప్- 4కు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర్ల రెసిడెన్షియల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన పింఛన్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతి పత్రం అందించి ఆదర్శంగా నిలిచారు.
News March 18, 2025
బాసర గోదావరిలో దూకిన మహిళ.. కాపాడిన స్థానికులు

బాసర గోదావరి నదిలో దూకి నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన సత్తేపల్లి లక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అటుగా వెళుతున్న స్థానికులు చెన్నాగౌడ్, సాజిత్, ముజ్జు గమనించి ఆ మహిళలను గోదావరినదిలో నుంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.