News March 12, 2025
NZB: ఇంటర్ పరీక్షలు.. 852 మంది గైర్హాజరు, ఒకరిపై మాల్ ప్రాక్టీసు కేసు

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-1ఏ పరీక్షకు 852 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి చీటీలు పెట్టి పరీక్ష రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 20, 2025
ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
News November 20, 2025
నిజామాబాద్: NPOs/NGOs దరఖాస్తు చేసుకోవాలి: DYSO

2025-26 సంవత్సరానికి జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం (NPYAD) పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ (ఆర్థిక సహాయం) కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO పవన్ కుమార్ తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన లాభాపేక్షలేని సంస్థలు (NPOs/NGOs) నుంచి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. అయితే ఈనెల 10న కిసాన్ గంజ్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఈనెల15న మృతి చెందాడు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని, ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ నువ్వు సంప్రదించాలని తెలిపారు.


