News December 12, 2024

NZB: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్ గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 13, 2025

బోధన్ పట్టణాన్ని సందర్శించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

image

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ మొట్టమొదటి లోకాయుక్త వెంకట రాములు ఆదివారం బోధన్ పట్టణంలో పర్యటించారు. బోధన్‌లోని శివాలయం, ఎల్లమ్మ ఆలయం, శక్కర్ నగర్‌లోని రామాలయం, ఆచన్ పల్లిలోని మారుతి ఆలయాలను సందర్శించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆయనతో పాటు బోధన్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

News January 12, 2025

రేవంత్ రెడ్డి పాలన RSS రూల్ ప్రకారమే జరుగుతుంది: కవిత

image

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అంతా RSS రూల్ ప్రకారమే జరుగుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆరోపించారు. ఆదివారం ఆమె నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ళ కేసీఆర్ పాలనలో మతకల్లోలాల జాడ కనిపించలేదని రేవంత్ సర్కార్ ఏడాది పాలనలోనే ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కాగా హామీలలో ప్రధానమైన మైనార్టీ డిక్లరేషన్ (చెవేళ్ళ) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News January 12, 2025

నిజామాబాద్: తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు

image

కోడి గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత ఆదివారం 100 గుడ్లు రూ.580 పలుకగా ఈ ఆదివారం కోడిగుడ్ల ధరలు తగ్గి 480 కు చేరాయి. అయితే చికెన్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో చికెన్ రూ. 200 నుంచి 240 (స్కిన్ లెస్), స్కిన్‌తో రూ. 180 నుంచి 200గా ఉంది. అయితే మటన్ రేట్లు మాత్రం కిలో రూ. 600 నుంచి 800గా ఉంది.