News March 20, 2025
NZB: ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Similar News
News November 14, 2025
NZB: ఇది ప్రజా విజయం: మహేష్ కుమార్ గౌడ్

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజా విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం అయినా నిజామాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసముంచి తమ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సంకేతమని అభివర్ణించారు.
News November 14, 2025
NZB: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: మహేష్ కుమార్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం తమదేనన్నారు. GHMC ఎన్నికలలోనూ ఇదే ఫలితాలు వస్తాయని, రాబోయే ఏ ఎన్నిక అయినా ఫలితం కాంగ్రెస్ దే నన్నారు. BRSకు ప్రజలు సెలవు ఇచ్చారని, ఆ పార్టీకి స్థానం లేదన్నారు. బీహార్ ఎన్నికలపై పూర్తి ఫలితాలు వచ్చాక స్పందిస్తానని అన్నారు.
News November 14, 2025
NZB: జిల్లా కాంగ్రెస్ భవన్ లో నెహ్రు జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్లో శుక్రవారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.


