News March 20, 2025
NZB: ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Similar News
News April 24, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికి నూతన చట్టం: కలెక్టర్

భూభారతి చట్టం ద్వారా రైతుల, ప్రజల సమస్యలు తీరుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి భీంగల్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
నిజామాబాద్: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని NZB అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిందడ్రులు చూడాలన్నారు.
News April 24, 2025
భగ్గుమంటున్న నిజామాబాద్.. జర జాగ్రత్త

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.